బూత్ స్థాయిలో టిడిపి బలోపేతం చెయ్యాలి-కిమిడి నాగార్జున

TDP Leader Kimidi Nagarjuna

TDP Leader Kimidi Nagarjuna

తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని.. అందుకోసం మనమంతా సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరి లో జరిగిన టిడిపి నాయకులు శిక్షణ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు. పలు అంశాలపై నాయకులుకు వివరించారు.చంద్రబాబు, కూటమి పాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పారు.రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని,రాష్ట్రంలో సంపద సృష్టికి నిరంతరం చంద్రబాబు తపన పడుతున్నారన్నారు.రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని, కృషిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. బలహీనమైన బూత్ ల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలనికష్ట పడుతున్నారు.ప్రభుత్వ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్ట్లు పారదర్శకంగా భర్తీ చేస్తు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.లోకేష్ పర్యవేక్షణలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *