ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి-ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

SP A.R DHAMODAR

Minorities Welfare Day Celebrations: విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో “మైనారిటీన్ వెల్ఫేర్ డే” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, మౌలానా అబుల్ కలాం అజాద్ (Maulana Azad) చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుడుగా, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖమంత్రిగా మౌలానా అబుల్ కలాం అజాద్ 11సంవత్సరాలు నిర్విరామంగా పని చేసి, జాతీయాభివృద్ధికి, విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు విశేషంగా కృషి చేసారన్నారు.

అటువంటి మహనీయుని జన్మ దినాన్ని “జాతీయ విద్యా దినోత్సవం” గాను “మైనారిటీస్ వెల్ఫేర్ డే” గాను నిర్వహించుకుంటున్నామన్నారు. తొలి విద్యాశాఖామంత్రిగా మౌలానా అబుల్ కలాం అజాద్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, అటువంటి మహనీయునుడును స్మరించుకోవడం భారత పౌరులుగా మనందరి కర్తవ్యమని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.

Minorities Welfare Day Celebrations: ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ అంబేద్కర్, డిసిఆర్ బి సిఐ కే.కుమార్ స్వామి, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాస రావు, ఆఫీసు సూపరింటెండెంట్లు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, మౌలానా అబుల్ కలాం అజాద్ చిత్ర పటానికి పూలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

Also Read: “ప్రజా ఉద్యమం”తో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *