మాయాబజార్ చిత్రమాలిక పుస్తకావిష్కరణ
The book 'Mayabazar Photo Collection' was launched.
Maya Bazar book release: విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి రాజేశ్వరరావు మాయాబజార్ (Mayabazar) సినిమాపై పెన్సిల్ తో చిత్రించిన 100 చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక సంచికను విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయ లక్ష్మి గజపతిరాజు తన కార్యాలయంలో ఆవిష్కరించారు . వైవిధ్యంగా అత్యంత నైపుణ్యంగా చిత్రాలను రూపొందించినందుకు రాజేశ్వరరావును ఎమ్మెల్యే అభినందించారు .తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ విభాగం తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం,చిత్రకారుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

గ్రంధాలయాలకు పూర్వవైభవం కోసం కృషి చేయాలి
Efforts should be made to restore libraries to their former glory. విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన డొంకాడ బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ గురజాడ పేరుతో గల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పూర్వ వైభవం తేవాలని , జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలలో విద్యార్థులు చదువుకునేందుకు మంచి పుస్తకాలతో పాటు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు .ఈ సందర్భంగా చైర్మన్ ను సత్కరించారు.
Also Read: కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం
