సత్యసాయి బాబా సేవలో వైసీపీ యువనేత డాక్టర్ బొత్స సందీప్

Botcha Sandeep

Botcha Sandeep

Botcha Sandeep tour in Garividi: సామాజిక, ఆధ్యాత్మిక సేవకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వైసీపీ యువనేత డాక్టర్ శ్రీ బొత్స సందీప్… సోమవారం గరివిడి పట్టణంలో పర్యటించి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గరివిడి పట్టణ నాయకులు రేగుల సూరిబాబు ఆహ్వానం మేరకు RMC యూత్ ఆధ్వర్యంలో రామేశ్వరుని కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బొత్స సందీప్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి RMC యూత్ సభ్యులు డాక్టర్ బొత్స సందీప్ కు సాదర స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ బొత్స సందీప్… అనంతరం వినాయక నవరాత్రుల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు.

Botcha Sandeep tour in Garividi: అనంతరం రామేశ్వరుని కాలనీలోని శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు యువనేత డాక్టర్ బొత్స సందీప్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొత్స సందీప్ గారు మాట్లాడుతూ… స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు వివిధ గ్రామాల ఎంపిటిసి మాజీ సర్పంచ్ లు, యలకల అప్పల నాయుడు , బమ్మిడి కార్తీక్ , అప్పారావు , వాకాడ గోపి, రాంబాబు , పొన్నాడ కుమార్ ,రాంబాబు , తమ్మీ నాయుడు , సూర్యారావు ,అప్పల నాయుడు,రమణ, రేగుల వినోద్ ,కాంతారావు , రామకృష్ణ , రాము , సంతోష్ , సురేష్ , కృష్ణ పట్టణ మాజీ వార్డ్ మెంబర్లు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Also Read: గుండెపోటుతో మృతి చెందిన ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *