ఏకగ్రీవాలతోనే పంచాయితీల అభివృద్ధి – చిన్న శ్రీను

Majji Srinivasarao

Majji Srinivasarao

Majji Srinivasarao on Elections: గ్రామ స్వరాజ్యం, అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన స్థానాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నగదు ప్రోత్సాహకాలను ప్రకటించిందని ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్, తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. ఐదువేలు జనాభా ఉన్న పంచాయితీలకు 15 లక్షలు, ఐదు నుండి 10 వేలు జనాభా కలిగిన పంచాయితీలకు 25 లక్షలు, పదివేలు జనాభా పైబడిన మేజర్ పంచాయితీలు ఏకగ్రీవం అయితే ప్రభుత్వం తరపున 50 లక్షల నగదు ప్రోత్సాహకాలను ప్రకటించిందని ఆయన స్పష్టం చేసారు. కాబట్టి పంచాయితీలను ఏకగ్రీవం చేయడం ద్వారా… ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాలను ఉపయోగించి గ్రామాభివృద్ధికి అందరూ కృషి చేయాలని కూటమి నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని నమ్మి ఎన్నికల బరిలో దిగడం వలన గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించిన వారవుతారని ఆయన హితవు పలికారు. ఆదివారం ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు చేస్తున్న అంకెల గారడీకు తనదైన శైలిలో గణాంకాలతో సమాధానమిస్తూ పలు అంశాలపై మాట్లాడారు.

Majji Srinivasarao on Elections: ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ… ఇటీవల నవంబర్ 5న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో 76.21 శాతం తుది పోలింగ్ నమోదైందని, ఇది రాష్ట్ర సగటు 70.72 శాతం కంటే ఎక్కువని తెలిపారు. జిల్లాలో మొత్తం 12,85,692 మంది ఓటర్లు ఉండగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. నవంబరు 1న జరిగిన మున్సిపల్, నవంబర్ 5న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు చాలా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని… దీనికి జిల్లా వ్యాప్తంగా ఒక చిన్న కేసు నమోదు కాకుండా పోలింగ్ పూర్తికావడం నిదర్శనమన్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి సుమారు 3.95 లక్షల ఓట్లు వచ్చాయని… ఆ పార్టీ చాలా బలంగా ఉందంటూ వైసీపీ నాయకులు ఎన్నిలక ఫలితాలను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే అఖండ మెజారిటీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. కాని ఈ ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలకు విశ్లేషించుకోకుండా… కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులుగా మేము ప్రజా తీర్పును ఒక బాధ్యతగా తీసుకుని… రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేసారు. అదే సమయంలో వైసీపీ నాయకులు తన ఓటమిని హుందాగా స్వీకరించి… ఓటమిగల కారణాలు విశ్లేషించుకుని ప్రజాస్వామ్యంలో మందుకు వెళ్ళాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుల అంకెల గారడీల పట్ల గ్రామస్థాయిలో ప్రజలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Majji Srinivasarao on Elections: చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో ఏపీకి భారీగా పెట్టుబడులు

Majji Srinivasarao on Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్న నిరంతర కృషి సత్ఫలితాలను ఇస్తోందని చిన్న శ్రీను అన్నారు. వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంపై నమ్మకం పెరుగుతోందని పేర్కొన్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 ద్వారా మరో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 303 అవగాహన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా 3,48,309 ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని, దీంతో మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరినట్లు వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గతంలో వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు ఆమోదం పొందగా, 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమైన దశకు చేరుకున్నాయని, వీటి పెట్టుబడి విలువ రూ.7.30 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని గుర్తించకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, పరిశ్రమలు ఏర్పాటు కావడం, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రయత్నాలు, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని ముందంజలో నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

2029 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయమే లక్ష్యం

Majji Srinivasarao on Elections: రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని చిన్న శ్రీను పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వమని అన్నారు. కార్యకర్తలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, ఇబ్బందులకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, పార్టీ నాయకత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ యువతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని ప్రజలు వాస్తవాలతో బేరీజు వేసుకోవాలని, అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిన్న శ్రీను స్పష్టం చేశారు.

Also Read: పంచాయితీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కు చిన్న శ్రీను స్కెచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *