వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మహిళా నేత బొత్స అనూష
Botcha Anusha
Botcha Anusha in Ganesh Immersion: విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలోని రామేశ్వర్ కాలనీలో RMC యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి (Ganesh Chaturthi) ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఆదివారం నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో రేగుల సూరిబాబు మరియు వినోద్ కుమార్ ల ఆహ్వానం మేరకు వైసీపీ భీమిలి సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా RMC యూత్, వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దీనితో జై జై గణేషా అంటూ రామేశ్వర్ కాలనీ కాలనీ గణనాధుని నామ స్మరణతో మారు మ్రోగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష… స్థానిక యువత, మహిళలు, చిన్నారులతో కలిసి ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండి… దినదిన అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాకుండా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించడమే కాకుండా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు RMC యూత్ కు, స్థానిక నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ సత్య సాయి బాబా ఆలయాన్ని సందర్శించిన బొత్స అనూష
Botcha Anusha in Ganesh Immersion: వినాయక నిమజ్జనంలో పాల్గొన్న అనంతరం డాక్టర్ బొత్స అనూష… రామేశ్వర్ కాలనీలో గల శ్రీ సత్యసాయి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు శ్రీ సత్య సాయి భజన మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం… ఆయన సాంప్రదాయం ప్రకారం ఆమె తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విశేశ్వరావు, వాకాడ గోపి, బమ్మిడి కార్తీక్,రమేష్, అప్పల నాయుడు, సురేష్, మాజీ వార్డ్ మెంబర్లు, ఆర్ఎంసి యూత్ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, మహిళలు, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: సత్యసాయి బాబా సేవలో వైసీపీ యువనేత డాక్టర్ బొత్స సందీప్
