కోడూరులో ఓటు హక్కు వినియోగించుకున్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త బొత్స అనూష

Botcha Anusha

Botcha Anusha

Botcha Anusha Cast Vote: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భీమిలి (Bheemunipatnam) నియోజకవర్గం సమన్వయకర్త మరియు బొండపల్లి జెడ్పీటీసీ అభ్యర్ధిని బొత్స అనూష తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గరివిడి మండలం కోడూరు పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేసారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ యువనాయకురాలికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Botcha Anusha Cast Vote: ఓటు వేసిన అనంతరం వైసీపీ యువనాయకురాలు బొత్స అనూష మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు ఓటు. ఈ ఓటు మన గ్రామాల అభివృద్ధిని, మన భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలి.
ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు… మన బాధ్యత కూడా అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బొండపల్లి జెడ్పీటీసీ స్థానం నుండి పోటీ చేస్తున్న తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు.

Also Read: వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మహిళా నేత బొత్స అనూష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *