రెవిన్యూ వసూళ్ళను ముమ్మరం చేయాలి-కమీషనర్
రెవిన్యూ వసూళ్ళను ముమ్మరం చేసి సంస్థల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలని విజయనగరం రీజన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ కమిషనర్లకు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పల్లి నలనయ్య ఆదేశించారు. భుధవారం మున్సిపల్ కార్ఫోరేషన్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కమిషనర్లతో చర్చించారు.ముఖ్యంగా రెవెన్యూ వసూళ్లు మందుకొడిగా ఉన్న పురపాలక సంఘాలకు ఆస్తి పన్ను, ఖాళీ స్థలముల పనులు త్వరితగతిన వసూళ్లు చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు.
అలాగే నీటి చార్జీలను శతశాతం వసూలు అయ్యే విధంగా చూడాలన్నారు. దుకాణాల అద్దెలను వసూలు చేయాలని, పన్ను పరిధిలోకి రాని ఆస్తి వివరాలు నమోదు చేసి పన్ను విధింపు చర్యలను చేపట్టాలన్నారు. పురమిత్ర యాప్ శతశాతం నిక్షిప్తమయ్యే విధంగా ప్రజలలో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. వీధి కుక్కలకు శతశాతం వ్యాక్సినేషన్ మరియు సంతాన నిరోధిక శస్త్ర చికిత్సలు జరిగే విధంగా చూడాలన్నారు.
