ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి-ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

merit scholarship

merit scholarship

2023-24 విద్యా సంవత్సరంకు నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన 16మంది హెూంగార్డు పిల్లలను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ. ఆర్.దామోదర్, జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించి,పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్ షిప్లను అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, అందుకు తగిన విధంగా విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి, మంచి ఫలితాలను సాధించాలన్నారు.

చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని, ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు ప్రయత్నించాలన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో హెూంగార్డ్సు ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. హెూంగార్డ్సు ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, హెూంగార్డ్సు సంక్షేమానికి కట్టుబడి 2023-24 విద్యా సంవత్సరంకు చదువులో ప్రతిభ కనబర్చిన, ఉన్నతంగా రాణించిన 16మంది విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేసామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, వెల్ఫేర్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, పోలీసు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *