4న డ్యాన్స్ ఫెస్టివల్
Dance Festival
ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 4వతేదీ ఆదివారం డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నార .లంక వీధిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ ప్రతులను గేట్ అధ్యక్షురాలు పెనుమజ్జి విజయలక్ష్మి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ నృత్య దర్శకుడు బెల్లాన రాజు కొరియోగ్రాఫర్ గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గీతాంజలి పాఠశాల తో కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నాలుగో తేదీ ఉదయం 10 గంటల నుండి కేఎల్ పురం పావని నగర్ లో గల గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన డాన్స్ ఫెస్టివల్ కు హాజరు కావాలని కోరారు .ఈ కార్యక్రమంలో లాస్య డాన్స్ స్టూడియో అధినేత బెల్లాన రాజు ,గీతాంజలి విద్యాసంస్థల కరస్పాండెంట్ ఏ శ్రీనివాసరావు ,డైరెక్టర్ రాజేష్ ,ప్రిన్సిపల్ మల్లిక,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
