వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా…ప్ర‌జ‌ల చేతిలోనే ప్ర‌భుత్వ సేవ‌లు-క‌లెక్ట‌ర్

District Collector S. Ramsundar Reddy

District Collector S. Ramsundar Reddy

వాట్సాప్ గవర్నెస్, మన మిత్ర యాప్ ల ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌లు మ‌రింత చేరువ అయ్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. *ప్ర‌జ‌ల‌చేతిలో ప్ర‌భుత్వం* పేరుతో ప్ర‌జ‌ల‌కు సుమారు 300 ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం రూపొందించిన వాట్సాప్ డిస్ప్లే స్కాన‌ర్ స్టాండ్‌ను క‌లెక్ట‌రేట్‌ పోర్టికో వ‌ద్ద ఏర్పాటు చేసారు. దీనిని సోమ‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఈ స్టాండ్లోని స్కాన‌ర్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లో ప్ర‌త్య‌క్షం అవుతాయ‌ని చెప్పారు. అలాగే నేరుగా 9552300009 వాట్సాప్‌ నెంబ‌ర్‌ను సేవ్ చేసుకోవ‌డం ద్వారా కూడా ఈ సేవ‌ల‌న్నిటినీ పొంద‌వ‌చ్చున‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. ఈ వాట్సాప్ డిస్‌ప్లే స్కాన‌ర్ స్టాండ్ల‌ను అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ద్దా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచి, ప్ర‌భుత్వ సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖ ఏడి పి.గోవింద‌రాజుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *