లక్ష్మీనివాస్ మిట్ట‌ల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి కొండ‌ప‌ల్లి

Minister Kondapalli Expresses Gratitude to Lakshmi Niwas Mittal

Minister Kondapalli Expresses Gratitude to Lakshmi Niwas Mittal

ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్‌తో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క‌ర‌చాల‌నం చేశారు. సోమ‌వారం అన‌కాప‌ల్లి జిల్లా న‌క్క‌పల్లి స‌మీపంలోని రాజ‌య్య‌పేట‌లో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ల‌క్ష్మీనివాస్ మిట్ట‌ల్ స్వాగ‌త కార్య‌క్రమంలో మంత్రులు నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌, గుమ్మ‌డి సంధ్యారాణితో పాటు మంత్రి కొండ‌పల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మీనివాస్ మిట్ట‌ల్‌తో క‌ర‌చాల‌నం చేసిన మంత్రి కొండ‌ప‌ల్లి వెన‌క‌ప‌డిన త‌మ‌ ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ఇంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి ఉత్తరాంధ్రకు గొప్ప మలుపు అని.. ఈ స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *