పలాస-కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !
Palasa Temple Stampede
Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక మాసం అందులోనూ ఏకాదశి కావడంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి భక్తులో పోటీ పడి… ఒకరినొకరు తోసుకోవడంతో… తొక్కిసలాటకు దారి తీసింది. మృతులంతా దాదాపు మహిళలలు అని సమాచారం. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… సహాయక చర్యలు ప్రారంభించారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తొక్కిసలాట ఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
Palasa Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇప్పటికే ఘటన గురించి దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి… హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరారు. బాధిత కుటుంబాలకు మంత్రి సానుభూతి వ్యక్తం చేస్తూ… గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని సూచించారు. ఆలయంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం
Palasa Temple Stampede: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాటపై సీఎం చంద్రబాబు (N. Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ మేరకు తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ద్వారా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: దివ్యాంగురాలు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
