ఓటుహక్కు వినియోగించుకున్న వైసీపీ యువనాయకులు బొత్స సందీప్ దంపతులు

Botcha Poojitha

Botcha Poojitha

Botcha Poojitha Cast Vote: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ యువనాయకులు బొత్స సందీప్, అతని సతీమణి మరియు గరివిడి జెడ్పీటీసీ అభ్యర్ధిని బొత్స పూజిత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గరివిడి మండలం కోడూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ లో సందీప్ దంపతులు ఓటు వేసారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద బొత్స సందీప్ దంపతులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ… సాధారణ ఓటరువలే క్యూ లైన్ లో నిలబడి బొత్స సందీప్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Botcha Poojitha Cast Vote: ఈ సందర్భంగా గరివిడి జెడ్పీటీసీ అభ్యర్ధిని, వైసీపీ యువ నాయకురాలు బొత్స పూజిత మాట్లాడుతూ…. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం. ఈ ఓటు అనే ఆయుధం మన గ్రామాల అభివృద్ధిని, దేశ భవిష్యత్ ను దిశానిర్ధేశం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వృధా చేసుకోకుండా…. ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆశీస్సులతో… గరివిడి మండలం నుండి మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టానని…. దీనికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. బొత్స కోడలిగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ… గరివిడి మండల ప్రజలు తమ స్వంత ఆడబిడ్డగా ప్రేమాభిమానాలు అందిస్తున్నారని… కాబట్టి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: కోడూరులో ఓటు హక్కు వినియోగించుకున్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త బొత్స అనూష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *