గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

“Cordon and Search” Operation in Gunkalam Layout

“Cordon and Search” Operation in Gunkalam Layout

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో గుంకలాం లేఔటులోని ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, నాటుసారా, అనుమానిత వ్యక్తులు, ఇతర నిషేధిత వస్తువులు,పదార్దాలే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించామన్నారు. గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 60 మందితో బృందాలుగా ఏర్పడి గుంకలాం లేఔటులోని ఇండ్లలోను, బహిరంగ ప్రదేశాలల్లో సోదాలు నిర్వహించామన్నారు. గ్రామంలో అన్ని ఇండ్లలో ఒకేసారి ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేసామన్నారు. అదే విధంగా వారి వద్ద లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 10 ద్విచక్ర వాహనాలను, 8 మంది అనుమానిత వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు.

అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి సూచనలు, ఆదేశాలమేరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు మమేకమై “కార్డన్ అండ్ సెర్చ్” ఉద్ధేశ్యాన్ని, ఆపరేషన్ లో అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించి, ప్రజలెవ్వరితో దురుసుగా వ్యవహరించ వద్దని దిశా నిర్దేశం చేసారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, నాటుసారావంటివి లభ్యం కాలేదన్నారు. “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను తరువాత గ్రామస్థులతో విజయనగరం ఇంచార్జి డిఎస్పీ ఆర్.గోవిందరావు సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *