‘429 జీవోను అమలు చేయాలని మంత్రికి వినతి’
Health Minister Satya kumar yadav
ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జోనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ 429 జీవోను అమలు చేసి, గ్రామీణ వైద్యులకు నిలిపివేసిన శిక్షణ తరగతులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించడం జరిగిందని మంత్రి సత్యకుమార్ తెలియజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, జోనల్ ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి, జోనల్ సలహాదారులు కోన ప్రకాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జి.భవాని తదితరులు పాల్గొన్నారు.
