ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన
Farmers protest against the construction of the ROB.
గరివిడి మండలం కొండశంభం గ్రామంలో రైల్వే గేట్ నంబర్ 446 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గ్రీవీన్స్ లో ఆర్ఓబి నిర్మించవద్దని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్ఓబి నిర్మాణం వల్ల సుమారు 30 కుటుంబాల రైతుల తమ భూమిని కోల్పోవడం జరుగుతుందని,ఇంతవరకు కనీసం గ్రామ పెద్దలకు, రైతుల అభిప్రాయం సేకరణ చేయకుండా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తమ భూములు కోల్పోతే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వాపోయారు. గతంలో ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కు ఆమోదం తెలపగా ఇప్పుడు, ఆర్ఓబి నిర్మాణం చేపట్టడం తమకు తెలియకుండా జరుగుతుందని తెలిపారు.ఈ విషయం పై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
