గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

Gurajada Apparao

Gurajada Apparao

Gurajada Apparao house in Vizianagaram: మహాకవి గురజాడ అప్పారావు (Gurajada Apparao) స్వగృహాన్ని రాష్ట్ర హైకోర్టు (Andhra Pradesh High Court) న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం సందర్శించారు. గురజాడ చిత్రపటాలను, ఆయన వాడిన వస్తువులను రచనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని చెప్పారు. మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర, గురజాడ సంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఏ గోపాలరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ను కలిసి పుష్పగుచ్చం అందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Gurajada Apparao house in Vizianagaram: వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విజయనగరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు.

Also Read: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *