భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Kimidi Nagarjuna

Kimidi Nagarjuna

Kimidi Nagarjuna on Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్బ్రాంతికరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఎద్దేవా చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత శరవేగంగా పనులు పూర్తి చేసుకుని… త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ నాయకులు అసంద్భంగా మీడియాలో హాడావుడి చేస్తున్నారన్నారు. కాని అసలు భోగాపురం ఎయిర్ పోర్టకు బీజం వేసింది… అనుమతులు తీసుకువచ్చింది… శంకుస్థాపన చేసింది… చివరకు పూర్తి చేసింది… ఎవరనేది ఈ సోషల్ మీడియా జమానాలా ఎవరూ దాయలేరని స్పష్టం చేసారు. జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

Kimidi Nagarjuna on Airport: ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ… భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ (Alluri Sitarama Raju International Airport) నిర్మాణానికి 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం బీజం వేసిందని… పర్యావరణ అనుమతులు తీసుకువచ్చి, భూసేకరణ చేసి, భూమి పూజ చేసిందని గుర్తు చేసారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేయడం ద్వారా ఎయిర్ పోర్ట నిర్మాణాన్ని అడ్డుకున్నారని… భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఎందుకంటూ సాక్ష్యాత్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసారని… ఈ విషయం స్థానిక వైసీపీ నాయకులు మరచిపోయినా…. ప్రజలు, మీడియా, సోషల్ మీడియా మరచిపోలేదని గుర్తు చేసారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో 23 శాతం పనులు పూర్తి చేసామని ఆనాడు అన్నారు. ఇప్పుడు మేమే పూర్తి చేసామని అంటున్నారు. ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వైఖరి విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా ఇలాంటి బూటకపు మాటలు మానుకోవాలని సలహా ఇస్తున్నా. బూటకపు మాటలతో సమావేశాలు పెట్టడం ద్వారా మీడియాలో పదే పదే కనిపించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నరంటూ ఆయన మండిపడ్డారు. కాని మీడియా, సోషల్ మీడియా జమానాలో ఎవరు ఎయిర్ పోర్ట్ కు బీజం వేసారు, పర్యావరణ అనుమతులు తీసుకువచ్చారు, భూ సేకరణ చేసారు, ఎవరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసారు అనేది ప్రజలందరికీ తెలుసని ఆయన స్పష్టం చేసారు.

Also Read: విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *