మొక్కజొన్న రైతులను ఆదుకొండి – శాసనమండలి విపక్షనేత బొత్స

Botcha Satyanarayana

Botcha Satyanarayana

Botcha Satyanarayana on farmers: కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు కరువయ్యాడని శాసనమండలి విపక్షనేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ఆరోపించారు. మోంథా తుఫాన్ తో నష్టపోయిన వరి, మొక్క జొన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వంలో విత్తనాలు, పురుగుల మందులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు… రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు వద్దకే ఎరువులతో సహా అందించామని… అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత రైతులను ఇక్కట్ల పాలు చేస్తుందన్నారు. శుక్రవారం గరివిడి పార్టీకార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించిన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బొత్స వారసులు, వైసీపీ యువ నేతలు బొత్స సందీప్, బొత్స అనూష పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల ఎంపీపీలు ,జడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, వివిధ హోదాల డైరెక్టర్లు, ఎంపిటిసి సర్పంచులు, వార్డ్ మెంబర్లు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష నేత బొత్స దృష్టికి తీసుకెళ్లారు.

Botcha Satyanarayana on farmers: ఈ సందర్భంగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) మాట్లాడుతూ… గతంలో మొక్క జొన్న రేటు 2400 ఉండేది… కనీసం ఇప్పుడు 1700 కూడా ఎవరు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రైతు కింటా దగ్గర సుమారు 700 రూపాయలు నష్టపోతున్నాడు. జిల్లా ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా మొక్కజొన్న రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కూటమీ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప… చేతలు కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి మొక్క జొన్న రైతును ఆదుకోవాలి. మోంథా తుఫాన్ వలన తీవ్రంగా నష్ట పోయిన వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

అయ్యప్ప సేవా సంఘం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మహిళా యువ నేత బొత్స అనూష

Botcha Anusha:మార్గశిర మాసం పోలి పాడ్యమి పర్వదినం పురస్కరించుకుని గరివిడి పట్టణంలో గల గాంధీ సెంటర్ దగ్గర అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా యువ నేత బొత్స అనూష ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె గాంధీ సెంటర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని… కాసేపు ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా తన చేతితో వడ్డించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు, జడ్పిటిసి వాకాడ శ్రీను,మాజీ వైస్ ఎంపీపీ ముళ్ళు రాంబాబు,వలిరెడ్డి లక్ష్మణ్,వైస్ సర్పంచ్ బమ్మిడి కార్తీక్,సర్పంచ్ ప్రతినిధి కుమార్ మరియు పట్టణ ఎంపిటిసిలు, వార్డ్ మెంబర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Also Read: వైసీపీ కార్యకర్తకు డాక్టర్ బొత్స అనూష ఆర్ధిక సహాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *