డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం
Collector Expresses Anger Over Duty Doctor's Absence
డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు.వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
