సింహాద్రి అప్పన్నకు బంగారు పగడాల హారం సమర్పించిన చిన్న శ్రీను కుటుంబం
Majji Srinivasarao 4
Majji Srinivasarao on Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పుట్టిన రోజు వేడుకలను విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వైసీపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కన్నుల పండుగగా నిర్వహించారు. జననేత పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చిన్న శ్రీను… స్వామి వారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి… ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సతీమణి పుష్పాంజలి, కుమార్తె మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహాస్ర (సిరమ్మ), అల్లుడు ప్రదీప్ నాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు… చిన్న శ్రీను కుటుంబానికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి అంతరాలయం దర్శనం అనంతరం సతీసమేతంగా కప్ప స్థంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయం తరపున చిన్న శ్రీను కుటుంబానికి వేద ఆశీర్వచనం చేసి… స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందించారు.

Majji Srinivasarao on Jagan: ఈ సందర్భంగా భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను మాట్లాడుతూ… వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. అందువల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని… త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు.

Majji Srinivasarao on Jagan: ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ SEC మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు ,కార్పొరేటర్లు. జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు , ప్రజా ప్రతినిధులు , వైసిపి కార్య కర్తలు , చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు , వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

ఆనందపురంలో జననేత జగన్ పుట్టిన రోజు వేడుకలు
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వైసీపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను), తన కుమార్తె మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆనందపురం పార్టీ ఆఫీస్ లో కేకు కటింగ్ చేసి, సంబరాలు జరుపుకున్నారు . ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ… వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లో ముందు ఉండే దన్నారు . విద్య, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేదన్నారు . ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. అందువల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాటం చెపుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.

Also Read: ఈ నెల 15న కోటి సంతకాలు ప్రతులు తరలింపు – భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను
