దివ్యాంగురాలు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించిన జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

Collector Distributes Pensions

Collector Distributes Pensions

Collector Distributes Pensions: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి… స్థానిక 49వ డివిజ‌న్‌లోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ చేసారు. దీనిలో భాగంగా మంచానికే ప‌రిమిత‌మైన దివ్యాంగురాలు వార‌ణాసి ప‌ద్మావ‌తి ఇంటికి వెళ్లిన… కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగుల కోటాలో ప్రభుత్వం తరపున అందిస్తున్న పింఛ‌న్ అంద‌జేశారు. అనంత‌రం మ‌రికొంద‌రు ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వెళ్లి పించ‌న్ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.న‌ల్ల‌న‌య్య‌, కూట‌మి పార్టీల నాయ‌కులు పాల్గొన్నారు.

అనంతరం స్థానిక డిఆర్‌డిఏ కార్యాల‌యంలో పింఛ‌న్ల పంపిణీ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. పింఛ‌న్ల పంపిణీని ప‌ర్య‌వేక్షించారు. అప్ప‌టివ‌ర‌కు 65 శాతం పంపిణీ జ‌రిగింద‌ని, తొలిరోజే 90 శాతం వ‌ర‌కు పంప‌ణీ చేస్తున్నామ‌ని డిఆర్‌డిఏ ఏపిడి కె.సావిత్రి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. ప్ర‌తీ అర‌గంట‌కు త‌మ‌కు స‌మాచారం పంపాల‌ని, సాయంత్రానికి శ‌త‌శాతం పంపిణీ జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ… 1వ తేదీనే శ‌త‌శాతం పింఛ‌న్ల‌ను పంపిణీ చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

సుంకరిపేటలో పెన్షన్ల పంపిణీ చేపట్టిన విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి

Collector Distributes Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు (Pusapati Aditi Vijayalakshmi) … విజయనగరం మండలం సుంకరిపేట గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసారు. అనంతరం విజయనగరం పట్టణం 30వ డివిజన్ (ధర్మపురి) లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వి ఇతర నాయకులు పాల్గొన్నారు.

Also Read: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *