గరివిడి-2 ఎంపీటీసీగా గెలుపొందిన మజ్జి లావణ్య

Majji Lavanya

Majji Lavanya

Majji Lavanya Won Garivid: గరివిడి-2 ఎంపీటీసీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మజ్జి లావణ్య గెలుపొందారు. తన సమీప ప్రత్యర్ధి జనసేన అభ్యర్ధి పెద్ది వెంకటేష్ పై 258 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతేకాదు గరివిడి జెడ్పీటీసీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత గెలుపులో మజ్జి లావణ్య కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బొత్స పూజిత… టీడీపీ తరపున బరిలో దిగిన స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్యను 1599 ఓట్లు తేడాతో ఓడించారు. దీనితో గరివిడి-2 ఎంపీటీసీగా గెలుపొందిన మజ్జి లావణ్య, ఆమె భర్త సంతోష్ కు… వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుండి మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వద్దకు ర్యాలీగా వెళ్ళి… ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తాము గెలవడమే కాకుండా తన కోడలు పూజిత గెలుపులో కీలక పాత్ర పోషించిన మజ్జి సంతోష్ దంపతులను మాజీ మంత్రి బొత్స అభినందించారు.

Majji Lavanya Won Garivid: ఇది ఇలా ఉండగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో గరివిడి మండలంలో అధికార కూటమి ప్రభుత్వానికి వైసీపీ తీవ్ర పోటీను ఇచ్చింది. గరివిడి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 11 స్థానాలను వైసిపి గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కేవలం గరివిడి మండలం కేంద్రంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలకు గాను మూడు స్థానాలకు తన ఖాతాలో వేసుకుని… స్థానిక ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది. అలాగే గరివిడి జెడ్పీటీసీ స్థానం నుండి వైసీపీ తరపున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత… 1599 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్యను ఓడించి… 2024 సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన మామ బొత్స సత్తిబాబును ఓడించిన కిమిడి కళా వెంకట్రావుకు ధీటైన సమాధానం ఇచ్చింది.

Also Read: గరివిడి జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ అభ్యర్ధి బొత్స పూజిత ముందంజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *