గరివిడి జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ అభ్యర్ధి బొత్స పూజిత ముందంజ

Botcha Poojitha

Botcha Poojitha

Botcha Poojitha in Lead: గరివిడి జెడ్పీటీసీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వైసీపీ అభ్యర్ధి బొత్స పూజిత ముందంజలో ఉంది. వైసీపీ అభ్యర్ధిని బొత్స పూజితకు 106 ఓట్లు రాగా… టీడీపీ అభ్యర్ధిని కిమిడి సంధ్యకి 94 ఓట్లు పడ్డాయి. ఏడు ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్ధులు దక్కించుకోగా…. రెండు ఓట్లు ఇన్ వ్యాలిడ్ అయ్యాయి. గరివిడి జెడ్పీటీసీ స్థానం నుండి కూటమి అభ్యర్ధిగా మాజీ మంత్రి, చీపరుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరపున మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ  (Botsa Satyanarayana) (సత్తిబాబు) కోడలు బొత్స పూజిత బరిలో ఉన్న విషయం తెలిసిందే. దీనితో గరివిడి జెడ్పీటీసీ ఫలితం ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: ఓటుహక్కు వినియోగించుకున్న వైసీపీ యువనాయకులు బొత్స సందీప్ దంపతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *