కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం

Minister Kondapali Srinivas

Minister Kondapali Srinivas

Minister Kondapalli slams YSRCP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించడమే కాక..  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు  వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) అన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణంలో పీపీపీ పద్ధతిని తప్పు పట్టారని, దానిపై చర్చకు రమ్మంటే తోక ముడిచారని గుర్తు చేశారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖనూ విచ్చిన్నం చేశారన్నారు. రూ.లక్ష కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ఆ లోటు అంతా భర్తీ చేయడమే పెద్ద కష్టంగా మారిందన్నారు. అలాంటి పరిస్థితిల్లో కూడా ప్రజల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం నిరంతరం పాటు పడుతోందని చెప్పారు.

Minister Kondapalli slams YSRCP: జలజీవన్ మిషన్ లో కేవలం పది శాతం మాత్రమే నిధులు ఉపయోగించారని.. దీనివల్ల కొన్ని చోట్ల తాగునీటి  సమస్య ఏర్పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిధులను ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. గతంలో రహదారులు సమస్య చాలా ఎక్కువగా ఉండేదన్నారు. ఇప్పుడు వాటిని బాగుచేయడమే కాక.. కొత్త రహదారులను  నిర్మిస్తున్నామని వివరించారు. ప్రస్తుత కూటమి పాలన చాలా అద్భుతంగా ఉందని తాజాగా ఇండియా టుడే చేపట్టిన సర్వేలో తేలిందన్నారు. ఇప్పటికిప్పుడు మరలా ఎన్నికలు నిర్వహిస్తే.. 2024 ఫలితాలు కన్నా 2 శాతం అధికంగా ఓటు బ్యాంకు వస్తుందని సర్వేలో తేల్చారని తెలిపారు. ప్రజా పాలన దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులు, మద్దతు కూటమి ప్రభుత్వానికి పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నాం – రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌


Minister Kondapalli slams YSRCP: విజయనగరం జిల్లాను అన్ని రంగాల్లో ముందంజ‌లో నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. 20 సూత్రాల కార్యక్ర‌మంపై సమీక్ష అనంత‌రం శ‌నివారం ఆయ‌న క‌లెక్ట‌రేట్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిరంత‌రం పాల‌న‌ను ప‌ర్య‌వేక్షిస్తూ… త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవ‌లు, రెవెన్యూ సేవ‌లు త‌దిత‌ర‌ రంగాల్లో ర్యాంకులు కేటాయిస్తు, అభివృద్దిలో జిల్లాల మ‌ధ్య అంత‌ర్గ‌త పోటీ పెడుతున్నార‌ని అన్నారు. అదేవిధంగా ఐవిఆర్ఎస్ స‌ర్వే ద్వారా ప్ర‌జాభిప్రాయాన్ని నిత్యం తెలుసుకుంటున్నార‌ని అన్నారు. అంతేకాకుండా ప్రతీ మూడు నెలలకోసారి కలెక్టర్లతో సమావేశాలను నిర్వహిస్తూ జిల్లాల ప్రగతిపై సమీక్షిస్తున్నారని తెలిపారు. వాటికి అనుగుణంగా జిల్లా ర్యాంకును మెరుగు ప‌రిచేందుకు తమవంతు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. దీనికోసం ప్ర‌తీనెలా జిల్లాలో స‌మీక్షా స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించిన‌ట్లు చెప్పారు.


జిల్లాలో మునుపెన్న‌డూ లేనివిధంగా గ‌తం కంటే 40 శాతం అధికంగా, ఈ ఏడాది సుమారు 4.53 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌ని, అంతేకాకుండా 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశామ‌ని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప‌ట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నార‌ని అన్నారు. విద్యార్ధుల మ‌ధ్యాహ్న భోజ‌నం కోసం త్వ‌ర‌లో 100 ట‌న్నుల‌ పోర్టిఫైడ్ కెర్న‌ర్ రైస్ రానుంద‌ని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి తెలిపారు. వ‌చ్చేవారం మ‌రో 200 ట‌న్నులు వ‌స్తుంద‌న్నారు. సుమారు వెయ్యి ట‌న్నుల కెర్న‌ర్ రైస్ అవ‌స‌ర‌మ‌ని, దానిని తెప్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

Also Read: మాజీ మంత్రి అంబటిపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం – వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *