రహదారి ప్రమాదాలపై ఆర్.టి.సి. బస్సు డ్రైవర్లకు అవగాహన కల్పించిన డిఎస్పీ
DSP made RTC bus drivers aware of road accidents
విజయనగరం Rtc. కాంప్లెక్స్ వద్ద Rtc డ్రైవర్లకు డిఎస్పీ ఆర్.గోవిందరావు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలలో Rtc బస్సులు గుద్ది చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉందని, డ్రైవర్లు నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ బస్సులను జాగ్రత్తగా నడపాలని, ప్రజలను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చాలని Rtc బస్సు డ్రైవర్లకు సూచించారు. బస్సులు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చేయకూడదని హెచ్చరించారు. డ్రైవర్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనే ప్రమాదాల నివారణకు మార్గమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సి.హెచ్.సురినాయుడు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో Rtc డ్రైవర్లు పాల్గొన్నారు.
