YCP MEETING

YCP MEETING

కార్యకర్తల్లో జోష్ నింపిన మజ్జి శ్రీనివాసరావు, సిరమ్మ

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. పద్మనాభం మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

క్షేత్రస్థాయిలో పోరాడదాం: మజ్జి శ్రీనివాసరావు పిలుపు

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఉత్తరాంధ్ర రీజనల్కో-ఆర్డినేటర్ కూరసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ ఆధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, ఉత్తరాంధ్ర జోన్-1కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి గార్లు మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో గళమెత్తాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రజలకు అండగా నిలవడంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఎల్లప్పుడూ ప్రజా పక్షమే నని,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఎల్లప్పుడూ ప్రజా పక్షమే నని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.

యువతకు స్ఫూర్తిగా సిరమ్మ

ఈ సమావేశంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమె, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వారసత్వం అంటే కేవలం పదవి కాదు, ప్రజల పట్ల ఉండే బాధ్యత అని ఆమె తన నడవడికతో చాటిచెప్పారు.ముఖ్యంగా యువతను రాజకీయాల్లో క్రియాశీలకం చేయడంలో సిరమ్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. “నాయకుడు అంటే కార్యకర్తలతో కలిసి నడిచేవాడు” అనే సిద్ధాంతంతో ఆమె క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య వారధిలా నిలుస్తూ ఆమె చూపిస్తున్న చొరవ భీమిలి నియోజకవర్గ యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.

ఈ కార్యక్రమంలో విశాఖ వైస్ జెడ్పీ చైర్మన్ సుంకర గిరిబాబు, ఎంపీపీ కె రాంబాబు, బుగత సత్యనారాయణ, తలాడ పద్మనాభం (పద్దు)తో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సిరమ్మ రాకతో పద్మనాభం మండల పార్టీలో కొత్త జోష్ నెలకొందని, పార్టీ బలోపేతానికి ఆమె చేస్తున్న కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *