వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ‘యువ’ కళ
Young blood in YSRCP

Young blood in YSRCP: కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ… జగనన్నను రెండో సారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పూల్‌బాగ్ రోడ్డులో గల జగన్నాథ్ ఫంక్షన్ హాల్ బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం యువరక్తంతో కళకళలాడింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో చిన్న శ్రీను వారసులు ప్రదీప్ నాయుడు, సిరమ్మ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైన్యానికి… నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.

Young blood in YSRCP: ముందుగా సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Reddy) విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించిన ఈ యువ దంపతులు… సమావేశానికి విచ్చేసిన వైసీపీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా పలకరిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, జగనన్నను రెండో సారి ముఖ్యమంత్రిని చేయడానికి చేయాల్సిన పోరాటాలపై యువతరం నాయకుల్లో నూతనోత్తేజాన్ని నింపారు.

దీనితో తమ అభిమాన నాయకుడు చిన్న శ్రీను అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె సిరమ్మ ఈ సమావేశంలో చురుగ్గా పాల్గొనడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు. యువతను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి వారు చూపిస్తున్న చొరవను అభినందించారు. ఈ దంపతుల రాక సమావేశ ప్రాంగణంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు లక్ష్యంగా పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే ఈ కీలక సమావేశంలో ప్రదీప్ నాయుడు, సిరమ్మల చొరవ క్యాడర్ లో ఆశక్తికర చర్చకు దారితీసింది.

Also Read: అవినీతి కూపంలో కూటమి ప్రభుత్వం – మాజీ మంత్రి బొత్స
