రంగస్థల కళాకారులను అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను
Majji Srinivasarao
Majji Srinivasarao on folklore: కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు వంటిదని… వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉమ్మడి విజయనగరం (Vizianagaram) జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. కళా రంగానికి విజయనగరంలో ప్రత్యేక గుర్తింపు ఉందని… దానిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. రంగస్థల రారాజు ఆచంట వెంకట రత్నం నాయుడు గారు దశమ వర్దంతి సందర్భంగా అచంట ఆర్ట్స్ అకాడమి, రావి నాంచారయ్యట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా నిర్వహించిన దుర్యోధన మయసభ ఏక పాత్రాభినయ పోటీల్లో ప్రధమ విజేతగా నిలిచిన విజయనగరంనకు చెందిన మండా రమేష్ ను ఆయన అభినందించారు. దుర్యోధన మయసభ ఏక పాత్రాభినయ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుండి సుమారు25మంది ఈపోటీలలో పాల్గొనగా…. మండా రమేష్ పోటీలలో ప్రధమ విజేతగా నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. దీనికి దినవాహి మురళీధర్ దర్శకత్వం మరియు సంగీతం వహించారు. ఈ సందర్భంగా వారిని దుశ్శాలువ, మెమెంటోలతో విజేతలకు సన్మానం చేసారు.

Majji Srinivasarao on folklore: అనంతరం శ్రీ హర్ష కళానికేతన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన విజయనగరం వేదికగా నిర్వహించబోయే శ్రీ ఆర్.టి.నాయుడు (తవిటినాయుడు)86 జయంతి సందర్భంగా 1) మయసభ 2) శ్రీ కృష్ణ రాయబారం 3) సత్య హరిశ్చంద్రనాటకం (వారణాశి కాటి శీను )వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్ష్యులు , నందీఅవార్డ్ గ్రహీత వంకాయల మారుతీ ప్రసాద్, కంది త్రినాద్, కందుల గున్నేశ్వరరావు , జి.పి.రాజు , రెడ్డి తిరుపతిరావు , మండా రమేష్, ఎ.టు. జెడ్ రామారావు మొదలగు కళాకారులు పాల్గొన్నారు.
తెర్లాం మాజీ పిఏసిస్ అధ్యక్షులు కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
ఇటీవల బొబ్బిలి నియోజవర్గం,పిఏసిస్ చైర్మన్ నర్సుపల్లి వెంకటేశ్వర రావు గారి తండ్రిగారు మాజీ పిఏసిస్ అధ్యక్షుడు నర్సుపల్లి అప్పలస్వామి గారు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ విషయం తెలిసి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తెర్లాం గ్రామం వెంకటేశ్వర రావు స్వగృహము నందు అప్పలస్వామి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు నర్సుపల్లి బాబ్జి, బొబ్బిలి ఎంపీపీ ప్రతినిధి శంబంగి వేణుగోపాల్, వైఎస్ఆర్ సీపీ మండల పార్టీ అధ్యక్షులు సత్యం నాయుడు, ఎంపీపీ ఉమా, జడ్పిటిసి ప్రతినిధి రామారావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: గురజాడ స్వగృహాన్ని సందర్శించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
