అభ్యుదయ వాది-తెలుగు సాహిత్య సారధి-గురజాడ అప్పారావు

Gurajada Apparao

Gurajada Apparao

Gurajada Apparao Death Anniversary: అభ్యుదయవాది,తెలుగు సాహిత్య సారధి గురజాడ అప్పారావు (Gurajada Apparao) చిరస్మరణీయుడని వాగ్దేవీ సమారాధన అధ్యక్షురాలు డాక్టర్ స్వప్నహైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురజాడ వర్ధంతిని గురజాడ స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గురజాడ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

Gurajada Apparao Death Anniversary: ఈ సంధర్భంగా తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కన్యాశుల్కం పేరుతో జరగుతున్న సాంఘిక దురాచారపు వికృత రక్కసి కోరల నుండి ఆడవారిని కాపాడి సంఘంపై సమర శంఖాన్ని పూరించగా చీకటి తెరలు తొలగిపోయి జ్ఞానకిరణాలు ఉత్తేజితమయ్యాయని, గురజాడ పేరు తలచుకున్నప్పుడల్లా నరనరాల్లో మానవత్వం పొంగి మానవతా వాదాన్ని మనసు నినదిస్తుందని అన్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టమని ఆయన చెప్పిన మాటలను పాటించాలని తెలుగు జాతికి వెలుగు జాడ గురజాడను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన కె.లహరి, టి.మేథా మాన్వితలకు పుస్తకాలను పతకాలను ప్రదానం చేసారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి, వాగ్దేవీ సమారాధనమ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, కాగుపాటి నారాయణమూర్తి, ముళ్లపూడి సుభద్రాదేవి, భోగరాజు సూర్యలక్ష్మి, గురజాడ వారసులు వెంకటేశ్వప్రసాద్ , ఇందిర,దంపతులు, ప్రముఖ న్యాయవాది దాసరిపద్మ తదితరులు పాల్గొన్నారు,

Also Read: ఆరెస్సెస్‌ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *