భీమిలిలో ఎగసి పడిన వైసీపీ “ప్రజా ఉద్యమం”
YSRCP Praja Udyamam Rally
YSRCP Praja Udyamam Rally: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భీమిలిలో వైసీపీ చేపట్టిన “ప్రజా ఉద్యమం” ఉవ్వెత్తున ఎగసిపడింది. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీకు విశేష స్పందన వచ్చింది. నియోజకవర్గం నలుమూలల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్టీవో కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసీపీ మహిళా యువ నేత మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహాస్ర (సిరమ్మ) ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భీమిలి తహసీల్దార్ కు వైసీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ… నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ ముందుకు కదిలింది. ఈ సందర్భంగా తన కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మతో కలిసి… ఒకే బైక్ పై అభివాదం చేసుకుంటూ… భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం SEC మెంబర్లు, రాష్ట్ర కార్యదర్శిలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా మరియు మండల పార్టీ కమిటీలలో వివిధ హోదాలో గల సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు,మరియు పెద్ద ఎత్తున్న ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.

YSRCP Praja Udyamam Rally: ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను మాట్లాడుతూ… ఈరోజు గౌరవ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసాము. ప్రజా వైద్యం – ప్రజల హక్కు అనే నినాదంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 50వేల సంతకాల చొప్పున సేకరించే కార్యక్రమం చేపట్టింది. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో 8500 కోట్లు ఖర్చుతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి… అందులో ఏడింటిని పూర్తి చేసి , ఐదు కాలేజీలను ప్రారంభించడం జరిగింది , మిగతా 10 కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం , ఈ 17 నెలల కాలంలో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసి , ఏడాదికి 1000 కోట్ల చొప్పున , ఐదేళ్లలో 5వేల కోట్లు ఖర్చు చేసి 10 మెడికల్ కాలేజీ లను పూర్తి చేయడం భారంగా భావిస్తూ , వీటిని ప్రైవేటుపరం చేయడానికి ముందుకు వెళుతుంది.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రానికి వైద్య సీట్లను కేటాయిస్తే … మాకు వద్దు అని కూటమి ప్రభుత్వం చెప్పడం అత్యంత దౌర్భాగ్యకరం. విద్య , వైద్యం ప్రజలకు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకి ఉందని బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు. దానికి అనుగుణంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్య , వైద్యాన్ని పేదలకు అందించడానికి ఎంతో కృషి చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ , వీటిని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ ప్రజలకు విద్య ,వైద్యాన్ని దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైసీపీ తన పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేసారు.

Also Read: రోడ్లపై డెబ్రిస్ వేస్తే భారీ జరిమానా-కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
