స్లాటర్ హౌస్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు- ఎస్పీ ఎ.ఆర్. దామోదర్
Vizianagaram SP Damodar
Vizianagaram SP Damodar: విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంలో స్లాటర్ హౌస్లుపై విజయనగరం (Vizianagaram) 1వ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 600 కిలోల మాంసం, రెండు వాహనాలు, మూడు కత్తులు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇటువంటి స్లాటర్ హౌస్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిసినట్లయితే ప్రజలు స్థానిక పోలీసులకు గాని 100/112 కు గాని సమాచారం అందించవలసిందిగా జిల్లా ఎస్పీ కోరారు.
అబద్ధపు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవు
మొంథా తుఫానుతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రజలకు సహాయక చర్యలు, రక్షణ చర్యలు చేపడుతుంటే.. కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు కట్టలు తెగిపోయి వరదలు వస్తాయని పనిగట్టుకొని దుష్ప్రభావం చేస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ హెచ్చరించారు.
Vizianagaram SP Damodar: జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ… మొంథా తుఫానుతో ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు తరలిస్తుంటే కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని జిల్లా ఎస్పీ అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా అబద్ధాలను ప్రచారం చేయడం వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. చెరువులకు గండ్లు పడ్డాయని, కట్టలు తెగిపోయి గ్రామాల్లోకి వరదలు వచ్చేస్తున్నాయి అని, సహాయక కేంద్రాల్లో డబ్బులు ఇస్తున్నారని అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. తుఫాను హెచ్చరికలతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు చేపట్టారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. దురుద్దేశంతో తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ హెచ్చరించారు.
Also Read: నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ
