యువత మత్తుకు బానిస కాకూడదు – హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
Homeminister anita
యువత క్షణికావేశాలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గంజాయి కేసుల్లో నిందితులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నామని, ఈగల్ నిఘా వ్యవస్థ ద్వారా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని క్రమశిక్షణతో చదువుకుంటే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు.ఉత్తరాంధ్రలో గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, భోగాపురం విమానాశ్రయం, విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి అనిత తెలిపారు.
యువతకు ఉద్యోగాలే లక్ష్యం.. నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు: మంత్రి శ్రీనివాస్

ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ వింగ్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ గంజా, ఆపరేషన్ చైతన్యం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

జిల్లా ఎస్పి ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. సంకల్పం పేరుతో గంజాయి సాగు లేకుడా చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించడం జరుగుతోందన్నారు. ఈగల్ వింగ్, ఆపరేషన్ గరుడ , ఆపరేషన్ గాంజా , ఆపరేషన్ చైతన్యం , ఆపరేషన్ సేఫ్ కాంపెయిన్ తదితర రూపాలలో మత్తు, మాదకం ద్రవ్యాల పై పని చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్ధాలు హానికరమని, వినియోగించను , విక్రయించను , ప్రోత్సహించను డ్రగ్స్ లేని, సురక్షితమైన సమాజానికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేయించారు.
