జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి
Srinivasa Murthy, founder of Sri Vagdevi Kala Peetham,
ప్రముఖ రచయిత సాహితీవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిడుగు రామ్మూర్తి పురస్కార గ్రహీత ఢిల్లీకి చెందిన శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈ నెల 24న విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు .తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 24వ తేదీ ఉదయం 10 గంటలకు గురజాడ పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తెలుగు భాషా ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు .
