‘జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఉద్యోగాలకు 9న రాత పరీక్ష’
District Principal Judge M. Babitha
విజయనగరం న్యాయ సేవా అధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు ఎం. బబిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు విజయనగరం కోటలోని మోతీ మహల్, ఎం.ఆర్. కాలేజీ (అటానమస్) వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు.షెడ్యూల్ ప్రకారం.. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉదయం 10:00 నుండి 11:30 గంటల వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మధ్యాహ్నం 1:00 నుండి 2:00 గంటల వరకు, మరియు ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుకు మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. దరఖాస్తుతో పాటు స్టాంపులు అంటించిన కవర్లు పంపిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇప్పటికే పంపడం జరిగిందని, అవి అందని వారు జిల్లా కోర్టు అధికారిక వెబ్సైట్ (https://vizianagaram.dcourts.gov.in) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టిక్కెట్లపై ఫోటో అటెస్టేషన్ లేని వారు వెంటనే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని, అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
