గ్రామీణ మౌళిక వస్తున్న కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Minister kondapalli Srinivasa Rao

Minister kondapalli Srinivasa Rao

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో రూ. 1.5 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులను మంత్రి కొబ్బరికాయ కొట్టి గురువారం ప్రారంబించారు. రావివలస నుంచి రామవరం వరకు వయా చెంచువానిచెరువు తుమ్మనాయుడు చెరువు మీదుగా ఈ బి టి రోడ్డును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి ఆమడ దూరం నెట్టివేశాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మౌళిక వసతులకు సంబంధించిన పనులకు ప్రధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నామని చెప్పారు.

గ్రామీణ రోడ్లు, సిసి డ్రైన్లు, గోశాలలు, స్మశానాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిచ్చి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా చేపట్టామని అన్నారు. ఇంత పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల జీవన విధానం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతూ హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, మాజీ మండలాధ్యక్షులు కొండపల్లి కొండలరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, అధికార, అనధికార ప్రముఖుల తోపాటు పలువురు కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *