విజయనగరంలో ఒకే ట్రాక్ పై పాసింజర్, గూడ్స్ రైళ్ళు
Train Mishap
Train Mishap in Vizianagaram: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్ళు వచ్చాయి. విశాఖ-కోరాపుట్ డీఎంయూ పాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా వచ్చాయి. ఒక దానికి ఒకటి ఎదురుపడటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. అయితే రెండు రైళ్ల లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Train Mishap in Vizianagaram: బుధవారం ఉదయం విశాఖ – కోరాపుట్ రైలు విజయనగరం నుంచి 8.20 సమయంలో బయలుదేరింది. విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్ దాటగానే… అదే ట్రాక్ మీద ఎదురుగా గూడ్స్ రైలు వస్తోంది. దీన్ని గమనించిన ఇరు పైలట్లు… వెంటనే అప్రమత్తమయ్యారు. పాసింజర్ రైలును కాసేపు నిలుపు చేశారు. దీనితో గూడ్స్ రైలు వచ్చిన మార్గంలోనే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు. గొట్లాం వరకూ గూడ్స్ రైలును వెనక్కి తీసుకెళ్లి… అక్కడ గూడ్స్ రైలును మరో లైన్ లోకి మార్చారు. అనంతరం విశాఖ-కోరాపుట్ డీఎంయూ పాసింజర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకు కదిలింది. దీనితో విశాఖ-కోరాపుట్ డీఎంయూ ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: వైసీపీ కార్యకర్తకు డాక్టర్ బొత్స అనూష ఆర్ధిక సహాయం
