శివ నామస్మరణతో మారుమ్రోగిన ఉమామహేశ్వర స్వామి ఆలయం
Andhragazette - Lord Shiva
కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినం పురష్కరించుకుని విజయనగరం (Vizianagaram) లోని ఉడాకాలనీ ఫేజ్ – 3లో గల శ్రీ ఉమామహేశ్వర (Shiva), శ్రీ అయ్యప్ప, శ్రీ సాయినాథ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సముదాయం శివ నామస్మరణతో మారుమ్రోగింది. నగరం నలుమూలల నుండి తెల్లవారు జామునుండే భక్తులు శివాలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో గల కోనేరు… ద్వజస్థంభం వద్ద అరటి దవ్వలు, ఉసిరి దీపాలు వెలిగించారు.

శివాలయం ప్రధాన అర్చకులు తెన్నేటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మహా శివునికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు,విభూది, గంథం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి… శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన పూలతో అలంరించారు. దీనితో హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కోట్ల సుగుణాకరరావు, వెంకటలక్ష్మి దంపతులు… ఆలయంలో కార్తీక మాసోత్సవాల పేరుతో నెలంతా ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి సోమవారం పర్వదినం పురస్కరించుకుని మహా శివుడికి సాయంత్రం దహీ అన్నం (పెరుగు అన్నం)తో అభిషేకం నిర్వహించారు. దీనితో దహిఅన్నం అభిషేకంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప, శివ మాల ధరించిన స్వాములు కూడా పెద్ద ఎత్తున ఈ అభిషేకంలో పాల్గొని శివపార్వతుల సేవలో తరించారు.


Also Read: ఏపీకి పొంచి ఉన్న మొంథా తుపాన్ ముప్పు !
