ఘనంగా మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌న్మ‌దినోత్స‌వం

moulna-abdul-kalam-azad

moulna-abdul-kalam-azad


Maulana Azad Birth Anniversary: భార‌త‌ర‌త్న మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ (Maulana Azad) బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, ఆద‌ర్శ‌నీయుల‌ని వ‌క్తలు కొనియాడారు. మౌలానా జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ దినోత్స‌వాన్ని, జాతీయ విద్యా దినోత్స‌వాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా అబుల్ క‌లాం చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన ఉత్త‌మ ఉపాధ్యాయులు, విద్యార్ధుల‌కు బ‌హుమ‌తి ప్ర‌దానం చేసి స‌త్క‌రించారు.

ఈ సంధర్బంగా ఇన్ఛార్జి జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి మాట్లాడుతూ అబుల్ క‌లాం గొప్ప‌ద‌నాన్ని కొనియాడారు.ప‌విత్ర‌ మ‌క్కాలో జ‌న్మించిన ఆయ‌న త‌న అస‌మాన ప్ర‌తిభ‌తో అత్యున్న‌త స్థాయికి ఎదిగార‌ని పేర్కొన్నారు.అందువ‌ల్లే అత‌ని జ‌న్మ‌దినాన్ని జాతీయ విద్యాదినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు.మ‌హ‌నీయుల త్యాగాల‌ను స్మ‌రించుకొని,వారి అడుగుజాడ‌ల్లో న‌డిచేందుకు వారి జ‌న్మ‌దినోత్స‌వాల‌ను,వ‌ర్ధంతుల‌ను నిర్వ‌హించుకుంటున్నామ‌ని చెప్పారు.మైనారిటీల సంక్షేమానికి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.

Maulana Azad Birth Anniversary: తూర్పుకాపు ఛైర్‌ప‌ర్స‌న్ పాల‌వ‌ల‌స య‌శ‌స్వి మాట్లాడుతూ అబుల్ క‌లాం గొప్ప స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులే కాకుండా,గొప్ప ర‌చ‌యిత‌గా,జ‌ర్న‌లిస్టుగా,న్యాయ‌వాదిగా గుర్తింపు పొందార‌ని చెప్పారు. నిరంత‌రం అధ్య‌య‌నం చేయ‌డం ఆయ‌న నైజ‌మ‌ని పేర్కొన్నారు. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం వ‌ల్లే ఆయ‌న అపార‌మైన జ్ఞానాన్ని పొందార‌ని,విద్యార్దులు ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకొని పుస్త‌క ప‌ఠ‌నాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని కోరారు.దేశ ప్ర‌ప్ర‌ధ‌మ విద్యాశాఖామంత్రిగా చేయ‌డం ఆయ‌న గొప్ప‌ద‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.





ఈ కార్యక్రమంలొ జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు, జిల్లా మైనారిటి సంక్షేమాధికారి షేక్ మ‌హ‌బూబ్ ష‌రీఫ్‌, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజ‌ర్ ఎన్‌.వెంక‌టేశ్వ‌ర్రావు, వివిధ మైనారిటీ సంఘాల ప్ర‌తినిధులు ఖాద‌ర్ భాషా, జ‌స్వీర్ సింగ్, ఆర్‌.ఎస్‌.జాన్‌, ఖ‌లీల్‌, అనురాధ బేగం త‌దిత‌రులు మాట్లాడుతూ అబుల్ క‌లాం ఆజాద్ గొప్ప‌ద‌నాన్ని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో వివిధ శాఖల అధికారులు, మైనారిటీ సంఘాల ప్ర‌తినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Also Read: రోడ్లపై డెబ్రిస్ వేస్తే భారీ జరిమానా-కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *