పంచాయతీ రోడ్లపై సమగ్ర నివేదికను తయారుచేయాలి- కలెక్టర్

Collector S Ramasunder reddy

Collector Review on Roads: విజయనగరం జిల్లాలోని పంచాయితీరాజ్ (Panchayati Raj) రహదారులపై వారం రోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సాయ సమావేశం జరిగింది. ఆయా శాఖల్లో అమలు జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాపై సమీక్షించారు. రక్షిత మంచినీటి పథకాలు, సరఫరా, త్రాగునీటి పథకాల నిర్మాణం, త్రాగునీటి పరీక్షలు, జలజీవన్ మిషన్ తదితర అంశాలను ఆరా తీశారు. కుళాయిల ద్వారా సురక్షిత త్రాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న రహదారులు, త్రాగు నీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Collector Review on Roads: ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీఆర్ పరిధిలోని సీసీ, బిటి, డబ్ల్యుబిఎం, మట్టి రోడ్ల స్థితిగతులపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రోడ్ల పొడవు, వాటి పరిస్థితి, చేయాల్సిన చిన్న పెద్ద మరమ్మత్తులు, అయ్యే వ్యయం తదితర సమగ్ర వివరాలను అందజేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో సిపివో పి.బాలాజీ, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కవిత, పలువురు ఈఈలు, డిఈ లు పాల్గొన్నారు.

Also Read: ఘనంగా మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌న్మ‌దినోత్స‌వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *