Pradeep Rawat: గుండెపోటుతో మృతి చెందిన ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్
Pradeep Rawat 2
Pradeep Rawat Passed Away: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్ర పోషించి తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో ప్రేక్షకులకు దగ్గరయిన ప్రదీప్ రావత్(74) హఠాన్మరణం చెందారు. ముంబయిలోని తన స్వగృహాంలో గుండెపోటుతో కుప్పకూలిన ప్రదీప్ రావత్ (Pradeep Rawat) ను… కుటుంబ సభ్యులు హుటాహుటీన కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ గత కొంతకాలంగా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. దీనితో రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Pradeep Rawat Passed Away: ప్రదీప్ రావత్ మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జనవరి 21, 1952లో జన్మించిన ప్రదీప్ రావత్… సినీ ఇండస్ట్రీలో విలన్ గా మెప్పించారు. కామెడీ పాత్రలతో పాటు విలన్ గా బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతిలో రాజ్ బిహారి పాత్రలో విలన్‌గా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సూర్య హీరోగా వచ్చిన గజిని మూవీలో విలన్‌గా రాణించారు. ఈ ఏడాదిలో ఇటీవలే రిలీజైన గాయపడ్డ సింహం చిత్రంలో కనిపించారు.

Pradeep Rawat: హిందీలో బాఘీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ప్రదీప్ రావత్… ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో ప్రతినాయక సహాయ పాత్రలతో మరింత గుర్తింపు పొందారు. బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారత్‌లో అశ్వత్థామ పాత్ర పోషించారు. సై సినిమాకు విలన్‌గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో లక్ష్మీ, స్టాలిన్, నాయక్, 1: నేనొక్కడినే’, సరైనోడు, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు, స్టాలిన్, లగాన్, గజిని లాంటి చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, వీర, అల్లుడు శీను, లయన్, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో మెప్పించారు.
‘భిక్షు యాదవ్’గా తెలుగు తెరకు పరిచయం..
Pradeep Rawat Passed Away: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘సై’ (Sye) సినిమాతో ‘భిక్షు యాదవ్’ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత ఆమిర్ ఖాన్, సూర్య కాంబినేషన్లలో వచ్చిన ‘గజినీ’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో జయంత్ సి. పరాంజీ ‘భద్ర’, ‘స్టాలిన్’, ‘ఛత్రపతి’ వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Pradeep Rawat Passed Away: 1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రిటైర్డ్ మేజర్ మంగళ్ సింగ్ రావత్ దంపతులకు ప్రదీప్ రావత్ జన్మించారు. ఆయన పూర్తి పేర్ ప్రదీప్ రామ్‌సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని మిలటరీ పాఠశాలలో ప్రదీప్ రావత్ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ జబల్పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో చేశాడు. అనంతరం జబల్పూర్లోని యూకోబ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుంచి దాదాపు రెండేళ్లు ప్రసారమైన ‘మహాభారత్’ మెగా సీరియల్లో ప్రదీప్ రావత్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. అదే ఆయనకు మొదటి సీరియల్ కావడం విశేషం. అయితే, ఆ సీరియల్లోకి ప్రదీప్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమ్మని దర్శకుడు రవిచోప్రాకు ప్రముఖ హిందీ నటీమణి స్మితా పాటిల్ రికమెండ్ చేశారు. దేశంలోని కోట్లాది మంది ప్రేక్షకులు ఆ సీరియల్ చూశారు. చివరికి మీడియా రారాజు బీబీసీ ఛానల్ కూడా ఆ సీరియల్‌ను ప్రసారం చేసింది.
Also Read: క్రాకర్స్, బిర్యానీ రెండూ ఉంటేనే పండగ – వరలక్ష్మీ శరత్‌కుమార్
