ఆరెస్సెస్ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో మంత్రి లోకేశ్ భేటీ
Nara Lokesh
Nara Lokesh meets RSS Leader: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భేటీ అయ్యారు. 2006-19 వరకు రామ్‌లాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా(సంస్థ), ఆరెస్సెస్‌లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఉండవల్లి సీఎం నివాసంలో మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఆరెస్సెస్ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. రామ్ లాల్‌ను మంగళగిరి శాలువాతో మంత్రి లోకేశ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, సత్యకుమార్ యాదవ్, ఆనం రాంనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం
Nara Lokesh meets RSS Leader: 5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భట్రాజు సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా సిరికొండ వెంకటేశ్వరరాజు నియమితులయ్యారు. ఏపీ పెరిక సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా వనపర్తి వీరభద్రరావు నియమితులయ్యారు. ఏపీ షేక్ సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా వడ్ల షేక్ ముక్తార్ నియమితులయ్యారు.
ఏపీ కుర్ని/కరికాల భక్తులు సంక్షేమం, అభివృద్ది కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా కమర్తి మినప్ప.. ఏపీ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా కొండా శంకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్ పర్సన్లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.
Also Read: దిల్లీ కాలుష్యంతో నేనూ ఇబ్బందిపడ్డా – సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
