చొరబాటుదారులు క్యాన్సర్ లాంటివారు – ఎంపీ కంగనా రనౌత్
Kangana Ranaut
Kangana Ranaut warns Mamata: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)… చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ను వ్యతిరేకిస్తూ.. బీజేపీను ఉద్దేశించి సీఎం మమతా బెనర్జీ చేసిన విమర్శలపై ఈ మేరకు స్పందించారు.
‘‘ఇటువంటి బెదిరింపులకు దేశం భయపడదు. చొరబాటుదారులను తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు. వీరంతా శరీరంలో క్యాన్సర్ లాంటివారు. వారిని సాగనంపాల్సిందే’’ అని కంగనా రనౌత్ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయోధ్య రామాలయం ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్థాన్ విదేశాంగశాఖ చేసిన ప్రకటనపైనా మండిపడ్డారు. ‘‘రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతుండటంతో పాక్ భయపడుతోంది. ఆ దేశం ఓ భిక్షాటన పాత్రగా మారింది. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో మరింత ముందుకెళ్లనుంది’’ అని పేర్కొన్నారు.
Kangana Ranaut warns Mamata: ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ మంగళవారం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ‘బీజేపీ కమిషన్’గా మారిందని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తే… దేశవ్యాప్తంగా భాజపా పునాదులను కదిలిస్తానని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చిన తర్వాత.. ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.
Also Read: ఏటా లక్ష మంది ‘అగ్నివీర్’ల భర్తీ ?
