వైసీపీ కార్యకర్తకు డాక్టర్ బొత్స అనూష ఆర్ధిక సహాయం

Dr Botcha Anusha

Dr Botcha Anusha

Dr Botcha Anusha: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) కుమార్తె డాక్టర్ బొత్స అనూష మానవత్వం చాటుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చీపురుపల్లిలో ఇటీవల వైసీపీ నిర్వహించిన “ప్రజా ఉద్యమం” ర్యాలీలో గాయపడిన చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడును పరామర్శించారు. పాపినాయుడు చికిత్స పొందుతున్న చీపురుపల్లిలోని బాబూజీ ఆసుపత్రిని సందర్శించిన ఆమె… అక్కడి వైద్యులతో మాట్లాడి… అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆమె… ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి సూచించారు. అనంతరం పాపినాయుడితో మాట్లాడి… అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాపినాయుడు కుటుంబానికి ఆమె ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండలంలో పాటు పర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dr Botcha Anusha: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం “ప్రజా ఉద్యమం” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు ఎడమ కాలుకి తీవ్ర గాయం అయింది. దీనితో అతడ్ని స్థానిక బాబూజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన వివరాలు తెలుసుకున్న బొత్స సత్యనారాయణ… మెరుగైన వైద్యం అందించాలని స్థానిక నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి బొత్స సత్యనారాయణ తరపున… డాక్టర్ బొత్స అనూష… పాపినాయుడిని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు. దీనితో తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకుని కార్యకర్తలకు అండగా ఉండటంలో డాక్టర్ అనూష చూపించిన అభిమానం, ఆప్యాయత, బాధ్యతల పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బొత్స కుటుంబం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, బొత్స కుటుంబం అభిమానులకు అండగా నిలవడంలో… తండ్రి బాటలో నడిచి తండ్రిని మించిన తనయగా డాక్టర్ అనూష పేరుపొందాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read: భీమిలిలో ఎగసి పడిన వైసీపీ “ప్రజా ఉద్యమం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *