దాతృత్వం చాటుకున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ

Majji Siri Sahasra

Majji Siri Sahasra

Majji Siri Sahasra: ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించి… నేనున్నాని భరోసా కల్పించడంలో ఎప్పుడూ ముందుండే విజయనగరం (Vizianagaram) జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)… గారాల పట్టి సిరి సహాస్ర (సిరమ్మ) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పార్వతీపురం బస్టాండ్ లో ఇటీవల జరిగిన మందుగుండు సామగ్రి పేలుడు ఘటనలో తీవ్ర గాయాల పాలై… డాక్టర్ రామ్మోహన్ నాయుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రెడ్డి రమేష్ ను చిన్న శ్రీను సోల్జర్స్ బృంద సభ్యులతో కలిసి ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని… అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతనికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

ఈ నేపథ్యంలో పార్వతీపురం ఆర్డీసీ కాంప్లెక్స్ లో రోజువారీ కళాసీగా పనిచేస్తూ… దురదృష్టకర ఘటనలో గాయాలు పాలైన రమేష్… పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. ఈ నేపథ్యంలో రమేష్ కు, అతని కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ… చిన్న శ్రీను సోల్జర్స్ తరపున అతనికి రూ.50,000 ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ మహా చండీహోమంలో పాల్గొన్న సిరమ్మ

Majji Siri Sahasra: శ్రీ భువనేశ్వరీ మాత అనుగ్రహంతో ప్రజలలో దైవభక్తి, ధర్మాచరణ, జ్ఞానవైరాగ్యాలు పెంపొందించి సమాజం సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో భీమిలి మండలంలోని బోడమెట్టపాలెం జొన్నాడ టోల్ గేట్ సమీపంలో ఉన్న శ్రీ భువనేశ్వరీ మాత శక్తి పీఠం ప్రాంగణంలో ప్రతీ ఏటా శ్రీ మహా చండీ హోమం నిర్వహిస్తున్నామని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహాస్ర (సిరమ్మ) తెలిపారు. శ్రీ నిర్మలానందగిరి స్వామి వారు ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కార్తీక మాసం అంతా చతుర్మాస్య వ్రత కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన శ్రీ మహా చండీహోమంలో సిరమ్మ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Majji Siri Sahasra: అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న సిరమ్మ… భక్తులకు ప్రసాదం వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ మాట్లాడుతూ… “ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్మలానందగిరి స్వామి వారు మహా చండీ హోమం నిర్వహించడం విశేషం. పూర్ణాహుతి కార్యక్రమం భక్తుల చేతుల మీదుగా జరిపారు. శ్రీ మహా చండీ హోమం ద్వారా శ్రీ భువనేశ్వరీ మాత అనుగ్రహంతో ప్రజలలో దైవభక్తి, ధర్మాచరణ, జ్ఞానవైరాగ్యాలు పెంపొందించి సమాజం సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

Also Read: రాష్ట్ర భవిష్యత్ కోసం “ప్ర‌జా ఉద్య‌మం” – వైసీపీ భీమిలి ఇన్ చార్జ్ చిన్న శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *