రాష్ట్ర భవిష్యత్ కోసం “ప్రజా ఉద్యమం” – వైసీపీ భీమిలి ఇన్ చార్జ్ చిన్న శ్రీను
YSRCP Praja Udyamam
YSRCP Praja Udyamam: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్, వైయస్సార్సీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టబోయే “ప్రజా ఉద్యమం” కార్యక్రమంపై భీమిలి నియోజవర్గం ఆనందపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహాస్ర (సిరమ్మ)తో కలిసి నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “ప్రజా ఉద్యమం” కార్యక్రమంపై నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం “ప్రజా ఉద్యమం” కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,భీమిలి నియోజవర్గ వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ అనుబంధ విభాగాల సభ్యులు,మండల మరియు వార్డు కమిటీ సభ్యులు ,మహిళా ప్రజా ప్రతినిధులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మాట్లాడుతూ… విద్య ,వైద్యం అనేది ప్రజల కనీస హక్కు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వీటిని ప్రజలకు దూరం చేస్తోంది. గత ప్రభుత్వం హాయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి… వాటిలో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తి చేసారు. అయితే 2024లో అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం… వాటి నిర్మాణం పూర్తి చేయలేక… పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర పన్నుతోంది.

YSRCP Praja Udyamam: అయితే మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైసీపీ పోరాడుతుంది… కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తాము. దీనికి యువత, ప్రజలు మద్దత్తు కూడా అవసరం. దీనిలో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా “ప్రజా ఉద్యమం” పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా తగరపువలస ఫుట్ బాల్ గ్రౌండ్ నుంచి భీమిలి ఆర్డిఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కాబట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత ఈ బైక్ ర్యాలీలో పాల్గొని… కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రతీ ఒక్కరూ మద్దత్తు తెలపాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
యువత మేలుకో… రాజకీయం కోసం కాదు… రాష్ట్ర భవిష్యత్ కోసం – వైసీపీ యువ మహిళా నేత సిరమ్మ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపడుతున్న “ప్రజా ఉద్యమం” రాజకీయాల కోసం కాదని… రాష్ట్ర భవిష్యత్ కోసమని… వైసీపీ యువ మహిళా నేత, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ స్పష్టం చేసారు. పేద, మధ్యతరగతి ప్రజలకు… వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ తో కోసం వైసీపీ చేపడుతున్న ఈ “ప్రజా ఉద్యమం”లో యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె సూచించారు.
Also Read: “ప్రజా ఉద్యమం”తో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను
