“ప్రజా ఉద్యమం”తో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను
Majji Srinivasa Rao
Majji Srinivasa Rao: విద్య, వైద్యం అనేది ప్రజల కనీస హక్కు అని… అయితే ఆ హక్కును కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం చేయడం దురదృష్టకరమని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత… కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురాకపోగా… గత ప్రభుత్వం తీసుకువచ్చిన కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సహా కూటమి ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను… “ప్రజా ఉద్యమం”తో ఎండగడతామని ఆయన స్పష్టం చేసారు. శనివారం థర్మపురిలోని సిరిసహాస్ర రైజింగ్ ప్యాలెస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శులు నేక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, నరసింహ మూర్తి, గొర్ల రవి, వేణు, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే “ప్రజా ఉద్యమం” వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
Majji Srinivasa Rao: ఈ సందర్భంగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత… ప్రభుత్వ వైద్యం పరిస్థితి దయనీయంగా మారింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలో ఎన్నడూ లేని విధంగా… గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) … రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటిలో ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తచేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అయితే వాటిని పూర్తి చేయడం చేతకాని కూటమి ప్రభుత్వం… పీపీపీ మోడల్ పేరుతో వాటిని ప్రైవేటు పరం చేసే కుట్రచేస్తోందన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద ప్రజలనకు ప్రజారోగ్యం దూరం కావడంతో పాటు… పేద, మధ్య తరగతి పిల్లలకు వైద్య విద్య పూర్తిగా దూరమౌతుందని అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న “ప్రజా ఉద్యమం” పేరుతో అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు చేస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తోందని… ఈ ఉత్సాహంతో “ప్రజా ఉద్యమం”లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

అమరావతికి వేల కోట్ల అప్పులు… కానీ మెడికల్ కాలేజీలకు మొండి చెయ్యి
అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఒకవైపున వేల కోట్లు అప్పులు తెస్తున్నారు… మరొకవైపు గత 17 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు… కానీ ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించలేకపోతోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించక ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసారు. చాలా చోట్ల డయాలసిస్ పేషెంట్లకు దిక్కు లేకుండా పోయింది. ఉత్తరాంధ్రా ఆరోగ్య ప్రధాయినిగా పేరుపొందిన విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో ఒక రోజంతా కరెంట్ లేకపోవడం… చిమ్మ చీకట్లో రోగులు ఇబ్బందులకు గురికావడం… ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వంకు ఉన్న శ్రద్ధ తెలుస్తోంది అని ఎద్దేవా చేసారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఫోటో షూట్ ఆపి… ఏం చేసారో చెప్పాలి
Majji Srinivasa Rao: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దకు వెళ్లి ఫోటోలు దిగి, 91 శాతం పనులు పూర్తి అయ్యాయని అసత్యాలు చెబుతున్నారు. అసలు భోగాపురం ఎయిర్ పోర్టుకు 2,203 ఎకరాల భూ సేకరణ చేసింది వైసీపీ ప్రభుత్వం. 527 నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని అందించింది వైసీపీ ప్రభుత్వం. జీఎంఆర్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని 23 శాతం పనులు పూర్తి చేసింది మా ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నిర్మాణ భాధ్యతలను జీఎంఆర్ సంస్థ… ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తే… వారు పనులు చేస్తుంటే… మంత్రి మాత్రం వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి గత ప్రభుత్వం కేటాయించిన పనులు, ప్రాజెక్టులు తప్ప… కొత్తగా మీ ప్రభుత్వం ఏం చేసిందో… ఏం చేస్తుందో ప్రజలకు చెప్పగలరా ? అని ప్రశ్నించారు. భోగాపురం నుండి మీ స్వగ్రామం నిమ్మాడ వరకు ఉత్తరాంధ్రకు ఉపయోగకరమైన ప్రాజెక్టు ఏదైనా మీరు ప్రారంభించారా అని ప్రశ్నించారు. మా వైసీపి ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చడం, మా హాయంలో చేసిన పనులను టిడిపి నేతలు తమ ఖాతాలో వేసుకోవడం తప్ప ఈ 17 నెలల్లో వీరు చేసింది కొత్తగా ఏమైనా ఉందా ? అంటూ ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నాయకులను ఆయన ఎండగట్టారు.

ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ధాటికి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు చాలా నష్టపోయారు. పంట నష్టానికి సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి… పూర్తిస్థాయిలో అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించాలి. తడిచిన,రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. గోనెసంచులను ప్రభుత్వమే రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
Also Read: కోట్లాదిమంది భారతీయుల గుండెచప్పుడు వందేమాతరం- భీశెట్టి బాబ్జి
