ఈ నెల 9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికలు పోటీలు

Skit Competition for Children

Skit Competition for Children

Skit Competition for Children: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (Andhra Pradesh Library Association), విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని ఆ సంఘం అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్ళపూడి సుభద్రాదేవిలతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ మాట్లాడుతూ… ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు గురజాడ పబ్లిక్ స్కూల్లో ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు 10వ తేదీ ఉదయం 9 గంటలకు నగదు బహుమతి ప్రదానంఉంటుందని పేర్కొన్నారు.

Skit Competition for Children: ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం, కుసుమంచి ఫౌండేషన్, వాకర్స్ వనిత క్లబ్(విజయనగరం ఫోర్ట్), గురజాడ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. నాటక పోటీలకు సమన్వయకర్తగా నంది పురస్కార గ్రహీత ఈపు విజయ్ కుమార్ వ్యవహరిస్తారని, న్యాయ నిర్ణీతలుగా కందుకూరి పురస్కార గ్రహీత పసుమర్తి సన్యాసిరావు, నంది పురస్కార గ్రహీత గెద్ద వరప్రసాద్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు .ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎం వి ఆర్ కృష్ణాజీ, ఏపీ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి ,పాఠశాల కరస్పాండెంట్ ఎం స్వరూప ,డిమ్స్ రాజు, డివి సత్యనారాయణ ,గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఏపీలో మరో బస్సు ప్రమాదం ! మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *