కాశీబుగ్గ తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించిన జెడ్పీ చైర్మెన్ చిన్న శ్రీను
Majji Srinivasarao
Majji Srinivasarao visits Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందగా 17 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు,భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్, మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు. తొక్కిసలాట క్షతగాత్రులకు అదే విధంగా మృతుల కుటుంబాలకు… వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైపీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తొక్కిసలాట జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రాంతానికి వెళ్లి… ఘటనకు గల కారణాలపై ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను ఆరా తీసారు.

Majji Srinivasarao visits Palasa:పలాస నుండి మరల శ్రీకాకుళం చేరుకుని… జెమ్స్ (GEMS Hospital) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను వారిని అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,పార్టీ అన్ని విధాల బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Majji Srinivasarao: ఇంత పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వచ్చిన నేపథ్యంలో… ప్రభుత్వం ముందస్తుగా తగిన ఏర్పాట్లను చేసి ఉంటే …ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని అన్నారు. ఈ పలాస పర్యటనలో రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణ దాస్,తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, కుంభ రవిబాబు, వైసీపీ నాయకులు పేడాడ తిలక్,గొర్లె కిరణ్ కుమార్,మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
